
Telangana Bjp : బీజేపీ అసెంబ్లీ అభ్యర్థుల మూడో జాబితా విడుదల.. DETAILS
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ మూడో లిస్ట్ ప్రకటించింది. ఇప్పటికే తొలి జాబితాలో 35 మందికి చోటు కల్పించిన కమలం, మలి విడతలో ఒక్కరి పేరును ప్రకటించింది. తాజాగా మూడో జాబితాలో 35 మంది పేర్లను వెల్లడించింది.
త్వరలోనే నాలుగో జాబితాను ప్రకటించేందుకు కసరత్తులు వేగవంతం చేస్తోంది. ఈ దఫా సీనియర్ నేతలతో పాటు కొత్తగా పార్టీలో చేరిన వారికీ టికెట్లు కేటాయించింది.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సొంత నియోజకవర్గం అంబర్ పేటలో కృష్ణయాదవ్ బరిలోకి దిగనున్నారు. ఆంథోల్ నుంచి బాబుమోహన్‌కు ఖరారు చేశారు.
ఉప్పల్ నుంచి ఎన్వీఎస్ ప్రభాకర్, సనత్ నగర్ నుంచి మర్రి శశిధర్ రెడ్డి ఫైనల్ అయ్యాయి. హుజూర్ నగర్ నుంచి మహిళా అభ్యర్థిగా శ్రీలతారెడ్డిని ప్రకటించారు.
DETAILS
పోటీ నుంచి తప్పుకున్న రాష్ట్ర అగ్రనేతలు లక్ష్మణ్, కిషన్ రెడ్డి
ముషీరాబాద్ నియోజకవర్గం తరఫున ముగ్గురు అభ్యర్థులు రేసులో ఉన్నారు.
వారిలో బీజేపీ జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు కె.లక్ష్మణ్, పార్టీ సీనియర్ నేత పూస రాజు గంగపుత్రతో పాటు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె బండారు విజయలక్ష్మి తుది రేసులో నిలిచారు.
ఈ మేరకు పార్టీ అధిష్టానం పూస రాజు గంగపుత్రవైపే మొగ్గుచూపడం విశేషం.దీంతో ముషీరాబాద్ బరిలో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ తరఫున ముగ్గురు బీసీ నేతలే బరిలోకి దిగడం విశేషం.
ఇప్పటికే అధికార పార్టీ అభ్యర్థిగా ముఠా గోపాల్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ పక్షాన మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ బరిలో దిగుతున్నారు.
ఇప్పుడు పూస రాజు అభ్యర్థిత్వం ఖరారు కావడంతో నియోజకవర్గంలో గట్టి పోటీ ఉండనుంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
మూడో జాబితా విడుదల చేసిన బీజేపీ
తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో పోటీ చేయనున్న బిజెపి అభ్యర్థుల మూడవ జాబితా.#TelanganaWithBJP pic.twitter.com/Xhk7BsdCJ4
— BJP Telangana (@BJP4Telangana) November 2, 2023